మేడ్చెల్: హైదరాబాదు సమీపంలోని అన్నోజిగుడా రాజీవ్ గృహకల్పలో నూతన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పది రోజుల క్రితమే వారి పెళ్లి అయింది.

ఏమైందో తెలియదు గానీ అన్నోజిగుడాలోని గృహకల్పలో ఇద్దరు ఉరేసుకుని మరణించారు. కుళ్లిపోయిన స్థితిలో వారి మృతదేహాలు కనిపించాయి. మూడు రోజుల క్రితమే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. 

మృతుల్లో పురుషుడిగాని మున్నా మల్లేష్ గా గుర్తించారు. అతను ఓల్డ్ ఆల్వాల్ కు చెందినవాడని సమాచారం.