స్కూల్ విద్యార్థిపై దంపతులు విచక్షణా రహితంగా దాడి చేశారు. కొట్టొద్దని కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడినా కనికరించకుండా దారుణంగా చితకబాదారు. వాళ్లే చిన్నారిపై దాడి చేసి... తిరిగి ఆ చిన్నారులకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన సనత్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సనత్ నగర్ లో ఓ భార్యభర్తలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ దారిలో రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆడుకుంటున్నారు. వారిలో ఒకరు అనుకోకుండా వెళ్లి ఆ దంపతులకు తగిలాడు. అంతే... సదరు మహిళ కోపంతో ఊగిపోయింది.

Also Read చచ్చిపోతే ఎలా ఉంటుందో..? గూగుల్ లో సెర్చ్ చేసి మరీ..

విద్యార్థుల్లో ఒకరిపై భార్యాభర్త విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది చూసిన విద్యార్థి స్నేహితుడు వచ్చి...కొట్టొద్దు, ఏం చేయలేదు అంటూ వారిని బతిమిలాడాడు. అదే సమయంలో బాధిత విద్యార్థి దంపతుల కాళ్లు పట్టుకున్నాడు. అయినా వారు కనికరించలేదు. 

లేబర్ పిల్లలు, చిల్లరగాళ్లు అంటూ విద్యార్థులపై దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీసీ టీవీ దృశ్యాలను చూసిన పోలీసులకు అసలు విషయమేంటో అర్ధమైంది. విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా ఫిర్యాదు చేసిన దంపతులపై పోలీసులు కేసు పెట్టి, వారిని అదుపులోకి తీసుకున్నారు.