మర్రిగూడమండలంలో బిజెపి కి ఎదురు దెబ్బ.. గులాబీ గూటికి కమలం నేతలు...(వీడియో)
మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ.. బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలంలో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మండల బిజెపి అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి, సరంపేట ఉప సర్పంచ్ కొత్త మల్లయ్యలు వారి వారి అనుచరులతో గులాబీ గూటికి చేరారు. వారితో పాటే నాంపల్లి మండలం మహమ్మాదాపురం యంపిటిసి మంజుల, గట్టుప్పల్ యంపిటిసి చెరుపల్లి భాస్కర్ తదితరులు టిఆర్ యస్ లో చేరిన వారిలో ఉన్నారు.
పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి అహ్హనించారు. ఇంకా ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, చందం పేట మాజీ యంపిపిగోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పెరిగిన విశ్వసనీయతకు చేరికలు నిదర్శనం అన్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత కు తాజా చేరికలు అద్దం పడుతున్నాయని చెప్పుకొచ్చారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పిన మంత్రి జగదీష్ రెడ్డి అనంతరం శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు తో కలసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం,అభివృద్ధిని చూసే టిఆర్ యస్ లోకి వలసల ప్రవాహం కొనసాగుతుందాన్నారు.