జగిత్యాల: జగిత్యాల పట్టణానికి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ శ్రీనుపై కొంతమంది హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనుపై కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు.

ఈ సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. కత్తి దాడితో కౌన్సిలర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది.

తెలిసినవారే ఈ దాడికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు.