తాజాగా హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో కేవలం 295 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్షా 8 వేల మార్కును దాటింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2579 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో లక్షా 8670కి చేరింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హైదరాబాదులో గత 24 గంటల్లో గతంలో కన్నా చాలా తక్కువగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో 295 కేసులు మాత్రమే నమోదయ్యాయి. నిజామాబాదులో ఎప్పటిలాగే కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఈ జిల్లాలో 142 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో 9 మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 770కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారి నుంచి 1752 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 84163కు చేరుకుంది. ఇంకా 23737 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

జిల్లాలవారీగా తెలంగాణలో గత 24 గంటల్లో నమోదైన కరోనా వైరస్ కేసులు

ఆదిలాబాద్ 34
భద్రాద్రి కొత్తగూడెం 83
జిహెచ్ఎంసీ 295
జగిత్యాల 98
జనగామ 46
జయశంకర్ భూపాలపల్లి 12
జోగులాంబ గద్వాల 47
కామారెడ్డి 64
కరీంనగర్ 116
ఖమ్మం 161
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 10
మహబూబ్ నగర్ 69
మహబూబ్ నగర్ 69
మహబూబాబాద్ 81
మంచిర్యాల 104
మెదక్ 42
మేడ్చెల్ మల్కాజిగిరి 106
ములుగు 16
నాగర్ కర్నూలు 48
నల్లగొండ 129
నారాయణపేట 19
నిర్మల్ 28
నిజామాబాద్ 142
పెద్దపల్లి 85
రాజన్న సిరిసిల్ల 59
రంగారెడ్డి 186
సంగారెడ్డి 30
సిద్ధిపేట 92
సూర్యాపేట 78
వికారాబాద్ 23
వనపర్తి 56
వరంగల్ రూరల్ 31
వరంగల్ అర్బన్ 143
యాదాద్రి భువనగిరి 46
మొత్తం కేసులు 2579

Scroll to load tweet…