హైదరాబాదులో మళ్లీ కరోనా ఉధృతి: తెలంగాణలో లక్షా 17 వేలపైనే కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. హైదరాబాదులో మరోసారి ఎక్కువ కేసులు 500కు పైగా నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు లక్షా 17వేలు దాటాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా గత 24 గంటల్లో మూడు వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2932 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 17,415కు చేరుకుంది.
గత 24 గంటల్లో తాజాగా తెలంగాణలో 11 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 799కి చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 28941 యాక్టివ్ కేసులున్నాయి.
హైదరాబాదులో మరోసారి కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపించింది. తాజాగా గత 24 గంటల్లో 520 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చెల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 200కుపైగానే కేసులు నమోదయ్యాయి. మరోవైపు జగిత్యాల జిల్లాలో వందకు పైగా కేసులు నమోదు కావడం కలవరానికి కారణమవుతోంది.
తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కేసులు
ఆదిలాబాద్ 25
భద్రద్రా కొత్తగూడెం 89
జిహెచ్ఎంసి 520
జగిత్యాల 113
జనగామ 38
జయశంకర్ భూపాలపల్లి 13
జోగులాంబ గద్వాల 46
కామారెడ్డి 51
కరీంనగర్ 168
ఖమ్మం 141
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 15
మహబూబ్ నగర్ 67
మహబూబాబాద్ 76
మంచిర్యాల 110
మెదక్ 24
మేడ్చెల్ మల్కాజిగిరి218
ములుగు 18
నాగర్ కర్నూలు 42
నల్లగొండ 159
నారాయణపేట 16
నిర్మల్ 32
నిజామాబాద్ 129
పెద్దపల్లి 60
రాజన్న సిరిసిల్ల 64
రంగారెడ్డి 218
సంగారెడ్డి 49
సిద్ధిపేట 100
సూర్యాపేట 102
వికారాబాద్ 22
వనపర్తి 51
వరంగల్ రూరల్ 34
వరంగల్ అర్బన్ 80
యాదాద్రి భువనగిరి 42
మొత్తం కేసులు 2932