తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 61 వేలు దాటింది. హైదరాబాదులో ఈ రోజు కాస్తా కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతునే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా గత 24 గంటల్లో 2273 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షా 61 వేల 844కు చేరుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 956కు చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో లక్షా 31 వేల 447 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో ఇంకా 30401 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

హైదరాబాదులో తగ్గుతూ వచ్చిన కేసులు గత 24 గంటల్లో స్వల్పంగా పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీలో గత 24 గంటల్లో 325 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు 300కు దిగువగానే కేసులు నమోదవుతూ వచ్చాయి.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది.

ఆదిలాబాద్ 19
భద్రాద్రి కొత్తగూడెం 56
జిహెచ్ఎంసీ 325
జగిత్యాల 50
జనగామ 33
జయశంకర్ భూపాలపల్లి 21
జోగులాంబ గద్వాల 21
కామారెడ్డి 68
కరీంనగర్ 122
ఖమ్మం 97
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 24
మహబూబ్ నగర్ 42
మహబూబాబాద్ 57
మంచిర్యాల 38
మెదక్ 24
మేడ్చేల్ మల్కాజిగిరి 164
ములుగు 22
నాగర్ కర్నూల్ 33
నల్లగొండ 175
నారాయణపేట 3
నిర్మల్ 36
నిజామాబాద్ 91
పెద్దపల్లి 47
రాజన్న సిరిసిల్ల 40
రంగారెడ్డి 185
సంగారెడ్డి 58
సిద్ధిపేట 91
సూర్యాపేట 73
వికారాబాద్ 24
వనపర్తి 32
వరంగల్ రూరల్ 33
వరంగల్ అర్బన్ 114
యాదాద్రి భువనగిరి 55

Scroll to load tweet…