తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 54 వేల మార్కును దాటింది. హైదరాబాదులో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గముఖం పట్టినట్లు అనిపిస్తున్నప్పటికీ తెలంగాణలో కరోనా వైరస్ జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణ 2278 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 54 వేల 880కి చేరకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధితో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 950కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 2458 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తెలంగాణ లక్షా 21 వేల 925కు చేరుకుంది. ఇంకా 32005 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

హైదరాబాదులో వరసగా ఈ రోజు కూడా తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ కాస్తా తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తు్నాయి. 

తెలంగాణలో గత 24 గంటల్లో జిల్లాలవారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ 25
భద్రాద్రి కొత్తగూడెం 80
జిహెచ్ఎంసీ 331
జగిత్యాల 56
జనగామ 31
జయశంకర్ భూపాలపల్లి 27
జోగులాంబ గద్వాల 21
కామారెడ్డి 78
కరీంనగర్ 121
ఖమ్మం 98
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 26
మహబూబ్ నగర్ 34
మహబూబాబాద్ 76
మంచిర్యాల 43
మెదక్ 24
మేడ్చెల్ మల్కాజిగిరి 150
ములుగు 12
నాగర్ కర్నూలు 34
నల్లగొండ 126
నారాయణపేట 22
నిజామాబాద్ 89
పెద్దపలలి 48
రాజన్న సిరిసిల్ల 53
రంగారెడ్డి 184
సంగారెడ్డి 62
సిద్ధిపేట 89
సూర్యాపేట 82
వికారాబాద్ 23
వనపర్తి 42
వరంగరల్ రూరల్ 28
వరంగల్ అర్బన్ 91
యాదాద్రి భువనగిరి 49

Scroll to load tweet…