వరుసగా మూడో రోజు హైదరాబాదులో కరోనా వైరస్ కేసులు తక్కువగానే నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య లక్షా 47 వేలు దాటింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే, హైదరాబాదులో మాత్రం వరుసగా మూడో రోజు తక్కువ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 2479 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 47 వేల642కు చేరుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 916కు చేరుకుంది. గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 2485 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షా 15 వేల 72కు చేరుకుంది. ఇంకా 31654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

హైదరాబాదులో గత 24 గంటల్లో కేవలం 322 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో 188 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి...

ఆదిలాబాద్ 31
భద్రాద్రి కొత్తగూడెం 83
జిహెచ్ఎంసి 322
జగిత్యాల 79
జనగామ 35
జయశంకర్ భూపాలపల్లి 14
జోగులాంబ గద్వాల 23
కామారెడ్డి 94
కరీంనగర్ 120
ఖమ్మం 94
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 24
మహబూబ్ నగర్ 40
మహబూబాబాద్ 67
మంచిర్యాల 67
మెదక్ 34
మేడ్చెల్ మల్కాజిగిరి 183
ములుగు 22
నాగర్ కర్నూలు 54
నల్లగొండ 108
నారాయణపేట 14
నిర్మల్ 43
నిజామాబాద్ 101
పెద్దపల్లి 71
రాజన్న సిరిసిల్ల 67
రంగారెడ్డి 188
సంగారెడ్డి 64
సిద్ధిపేట 88
సూర్యాపేట 96
వికారాబాద్ 16
వనపర్తి 33
వరంగల్ రూరల్ 34
వరంగల్ అర్బన్ 124
యాదాద్రి భువనగిరి 46
మొత్తం కేసులు 2479

Scroll to load tweet…