Asianet News TeluguAsianet News Telugu

ఆ ఊరికి కరోనా ఆమడ దూరం: ఇలా తరిమికొడుతున్న ప్రజలు

తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాగోజీగుడాలోకి కరోనా వైరస్ ప్రవేశించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆ గ్రామం విధించుకున్న సెల్ఫ్ లాక్ డౌన్. ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

Coronavirus feared of enter into thos village, because of
Author
jagitial, First Published May 9, 2021, 8:06 AM IST

జగిత్యాల: ఓకదిక్కు ప్రపంచం అంతా కరోనాతో అల్లాడిపోతుంటే,ఆ గ్రామం మాత్రం కరోనాకి ఆమాడ దూరంలో ఉంది. ఆ గ్రామస్థులు తీసుకుంటున్న చర్యలతో కరోనా వైరస్ ఊరి గుమ్మం కూడా తొక్కడం లేదు. కరోనాని కట్టడి చేస్తూ ప్రశాంతంగా ఉన్న ఆ పల్లె కథ ఏమిటో చదవండి.

మా ఇంటికి మీరు రాకండి,మీ ఇంటికి మేము రాము ఇది ప్రస్తుతం కరోనా కాలంలో వినిపిస్తున్న నినాదం. అలాగే మా ఊరికి  మీరు రాకండి మీ ఊరికి మేము రాం అంటున్నారు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంల రాగోజిపేట  గ్రామస్థులు. కరోనా సెకండ్ విజృంభిస్తున్న సమయంలో ఊరికి ఉన్న నాలుగు దారులు పూర్తిగా మూసేసి గ్రామంలోకి రాకుండా కాపల  కాస్తున్నారు.

కరోనా వైరస్ ఊరులోకి రాకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన,గ్రామంలోని వారు బయటికి వెళ్ళాల్సిన వచ్చిన గ్రామ పెద్దల అనుమతిని తప్పనిసరి చేశారు. అందుకే కరోనా రక్కసి ఆ గ్రామానికి అమడ దూరంలో ఉంది. రాగోజిపేట గ్రామస్థుల అప్రమత్తత, అవగాహనతో గ్రామంలోని ఏ ఒక్కరూ కూడా కరోనా బారిన పడడం లేదు.

గత ఇరవై రోజుల క్రితం మేడిపల్లి మండల కేంద్రంతో పాటుగా చుట్టుప్రక్కల ఇరవై గ్రామాలు సెల్ఫ్ లాక్ డౌన్ పెట్టుకున్నారు. రాగోజిపేట కూడా సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకుంది. ఒకవైపు జగిత్యాల జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రాగోజిపేటలో మాత్రం ఒక్కటి కూడా కరోనా కేసు  నమోదు కాలేదు.

రోజు ఉదయం కరోనా మహమ్మరీ వల్ల జరుగుతున్న ప్రమాదాలని, తీసుకోవలసిన జాగ్రత్తలని గ్రామపంచాయతి ఆధ్వర్యంలో మైకుల ద్వారా చెపుతున్నారు. గ్రామస్థులు స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటించడమే గాకుండా ప్రతి ఒక్కరూ మాస్కు ధరిస్తున్నారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు గ్రామంలో దుకాణాలని తెరుస్తున్నారు. మొత్తానికి రాగోజిపేట గ్రామంలో అప్రకటిత కర్ప్యూ విధించుకొని, రాత్రి తొమ్మిది దాటాక ఎవరైనా అనవసరంగా రోడ్టుపైకి వస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కఠిన నియమాలని అమలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios