తెలంగాణలోఉధృతంగా విస్తరిస్తున్న కరోనా: నిన్నోక్కరోజే 52 కేసులు నమోదు!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్నొక్కరోజే కొత్తగా 52 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలుపుకొని తెలంగాణలో కేసుల సంఖ్యా 600 దాటింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్యా 642గా ఉండగా, యాక్టీవ్ కేసుల సంఖ్య 516. 
 
COronavirus Cases telangana:52 cases recorded, taking the total to 642
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్నొక్కరోజే కొత్తగా 52 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలుపుకొని తెలంగాణలో కేసుల సంఖ్యా 600 దాటింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్యా 642గా ఉండగా, యాక్టీవ్ కేసుల సంఖ్య 516. 

నిన్న 7గురు డిశ్చార్జ్ అవగా, ఇప్పటివరకు ఈ మహమ్మారి బారి నుంచి 110 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నేడు కూడా ఒకరు ఈ కరోనా వైరస్ తో పోరాడుతూ మరణించారు. ఈ మరణంతో మొత్తం మరణాల సంఖ్య 18గా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 249 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇకపోతే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. ఈ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 1,211 కరోనా పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ 19 బాధితుల సంఖ్య 10,363కు చేరుకోగా.. వీరిలో 339 మంది మరణించారు.
గత 24 గంటల్లో 179 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 5.29 కోట్లమందికి ఉచిత రేషన్, ఆహార ధాన్యాలు సరఫరా చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తంగా 2.3 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. 37 లక్షల ర్యాపిడ్ కిట్లు ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. 

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకుగాను ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ‌ను పొడిగిస్తున్నట్టుగా ప్రధాని మోడీ ప్రకటించారు. మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. 

సోమవారం నాడు ఉదయం ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తోందన్నారాయన..ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశాన్ని రక్షించారన్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సాగిస్తున్నారన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశాన్ని రక్షిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

కరోనాపై బారత్ బలంగా పోరాటం చేస్తున్న విషయాన్ని మోడీ గుర్తుచేశారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరాన్ని జరుపుకొంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

కరోనాపై పోరాటం చేయడంలో దేశం మొత్తం ఒకేతాటిపై ఉందన్నారు ప్రధాని. దేశంలో ఒక్కకరోనా కేసు నమోదు కాకముందే దేశంలోకి వచ్చేవారిని స్క్రీనింగ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దేశంలో కరోనా మహహ్మరిగా మారకముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నట్టుగా మోడీ వివరించారు. 21 రోజుల పాటు లాక్‌డౌన్ సమర్ధవంతంగా అమలు చేసినట్టుగా చెప్పారు. 
కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా కేసులు దేశంలో తక్కువగా ఉన్నాయన్నారు. 

బౌతిక దూరం దేశానికి చాలా ఉపయోగపడిందని మోడీ అభిప్రాయపడ్డారు. ఎకానమీ కంటే జీవితం గొప్పదన్నారు.ఈ నెల 20వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు.

ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఆంక్షల్లో సడలింపు ఉంటుందని ఆయన సూచన ప్రాయంగా చెప్పారు. హాట్ స్పాట్స్ కాని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత ఆంక్షలను సడలించనున్నట్టుగా ఆయన చెప్పారు. ఆహారానికి, నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కొత్తగా కేసులు నమోదు కాని ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి సడలింపులు ఉంటాయని చెప్పారు.  
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios