తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 79 వేల మార్కును దాటింది. హైదరాబాదులో 300కు పైగా కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 79 వేల 246కు చేరుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1070కి చేరుకుంది. లక్షా 48 వేల 139 కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 30037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

హైదరాబాదులో 300కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ 126 కరోనా వైరస్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. 

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఇలా ఉంది..

ఆదిలాబాద్ 25
భద్రాద్రి కొత్తగూడెం 88
జిహెచ్ఎంసీ 308
జగిత్యాల 40
జనగామ 24
జయశంకర్ భూపాలపల్లి 20
జోగులాంబ గద్వాల 22
కామారెడ్డి 48
కరీంనగర్ 120
ఖమ్మం 86
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 22
మహబూబ్ నగర్ 36
మహబూబాబాద్ 68
మంచిర్యాల 44
మెదక్ 41
మేడ్చెల్ మల్కాజిగిరి 151
ములుగు 26
నాగర్ కర్నూలు 47
నల్లగొండ 136
నారాయణపేట 12
నిర్మల్ 21
నిజామాబాద్ 68
పెద్దపల్లి 42
రాజన్న సిరిసిల్ల 56
రంగారెడ్డి 168
సంగారెడ్డి 67
సిద్ధిపేట 95
సూర్యాపేట 82
వికారాబాద్ 19
వనపర్తి 43
వరంగల్ రూరల్ 34
వరంగల్ అర్బన్ 77
యాదాద్రి భువనగిరి 40

Scroll to load tweet…