తెలంగాణలో కరోనా ఉధృతి: లక్షా 38 వేలు దాటిన పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతికి కళ్లెం పడడం లేదు. హైదరాబాదులో తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఎప్పటిలాగే కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు లక్షా 38 వేలు దాటింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా తన కోరలను విస్తరిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2511 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య లక్షా 38 వేల 395కు చేరుకుంది.
గత 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించివారి సంఖ్య 877కు చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో కరోనా నుంచి 2578 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షా 4 వేల 603కు చేరుకుంది. ఇంకా 32915 యాక్టివ్ కేసులున్నాయి.
తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి...
ఆదిలాబాద్ 23
భద్రాద్రి కొత్తగూడెంం 93
జిహెచ్ఎంసి 305
జగిత్యాల 85
జనగామ 38
జయశంకర్ భూపాలపల్లి 12
జోగులాంబ గద్వాల 27
కామారెడ్డి 60
కరీంనగర్ 150
ఖమ్మం 142
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 23
మహబూబ్ నగర్ 42
మహబూబాబాద్ 58
మంచిర్యాల 73
మెదక్ 42
మేడ్చెల్ మల్కాజిగిరి 134
ములుగు 18
నాగర్ కర్నూలు 40
నల్లగొండ 170
నారాయణపేట 16
నిర్మల్ 31
నిజామాబాద్ 93
పెద్దపల్లి 65
రాజన్న సిరిసిల్ల 72
రంగారెడ్డి 184
సంగారెడ్డి 70
సిద్ధిపేట 80
సూర్యాపేట 96
వికారాబాద్ 19
వనపర్తి 40
వరంగల్ రూరల్ 36
వరంగల్ అర్బన్ 96
యాదాద్రి భువనగిరి 78
మొత్తం కేసులు 2511