కరోనా: అఫిడవిట్ దాఖలుకు ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకొందో సమగ్ర సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం నాడు ఆదేశించింది.
ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన పిల్‌ను తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ చేసింది. వలస కూలీలను స్వస్థలాలకు పంపాలని, ప్రతి కాలనీలో రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ఆ పిల్ లో అడ్వకేట్ భాస్కర్ కోరారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకొందనే విషయాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
రాష్ట్రంలో ఎన్ని కరోనా కిట్లు ఉన్నాయి, ఇప్పటివరకు ఎందరికి కరోనా పరీక్షలు నిర్వహించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొందని హైకోర్టుకు ఏజీ వివరించారు. రాష్ట్రంలో ఎన్ని రెడ్ జోన్లను ఏర్పాటు చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది.
also read:ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్‌పై దాడి: ముగ్గురిపై కేసు, దాడి చేసిన వ్యక్తికి కరోనా
కరోనా విషయంలో తీసుకొన్న చర్యలపై సమగ్ర సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఈ పిల్ పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.