కరోనా విలయం : అద్దెమనుషులతో అంత్యక్రియలు.. సెల్ ఫోన్ లో చూసుకుంటూ రోదనలు.. !!
కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. మానవసంబంధాల్ని మంటగలుపుతోంది. చిన్నా-పెద్దా, బీదా-గొప్పా, రాజు-పేదా తేడా లేకుండా అందర్నీ చుట్టేస్తుంది. తన విశ్వరూపంతో కరాళనృత్యం చేస్తే మానవాళికి సవాల్ విసురుతోంది.
కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. మానవసంబంధాల్ని మంటగలుపుతోంది. చిన్నా-పెద్దా, బీదా-గొప్పా, రాజు-పేదా తేడా లేకుండా అందర్నీ చుట్టేస్తుంది. తన విశ్వరూపంతో కరాళనృత్యం చేస్తే మానవాళికి సవాల్ విసురుతోంది.
ఆసుపత్రిలో కరోనాతో మృత్యువాత పడిన తమ వారిని చూసేందుకు కుటుంబ సభ్యులు రక్తసంబంధీకులు వెనుకాడే పరిస్థితి. మృతదేహాన్ని ముట్టుకోవడానికి లేకపోవడంతో కాష్టం పేర్చి, దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేయలేని దుస్థితి నెలకొంది.
మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది శ్మశానవాటికకు తరలించి దహన సంస్కారాలు చేస్తూ ఉంటే కళ్ల వెంట నీరు కారడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోంది.
ఇక మరో దారుణమైన విషయం ఏంటంటే కరోనాతో మృతి చెందిన తమ కుటుంబ సభ్యుల అంతిమ సంస్కారాలు అద్దె మనుషులతో పూర్తి చేయించాల్సి వస్తోంది. అంతిమ సంస్కారాలను సెల్ ఫోన్ లో వీడియో తీసి బంధువులకు పంపించి బోరున విలపిస్తున్నారు.
అద్దె ఇంట్లో ఉంటూ మృతిచెందిన వారి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మృతదేహాన్ని ఇంటి యజమాని ఇంటి వరకు కూడా అనుమతించకపోవడంతో అనాధ శవంలాగే అంత్య క్రియలు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆస్తులు అంతస్తులు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా కరోనాతో మృతి చెందితే అనాథ మరుభూమికి చేరాల్సిందే. అందరూ ఉన్న అనాధ శవం గా నే వెళ్ళిపోయావా రోధనలే తప్ప ఏమి చేయలేని స్థితి.
ఇలాంటి ఎన్నో ఘటనలు మనుషుల్లో మానవత్వాన్ని కనుమరుగు చేస్తున్నాయి. బంధుత్వాలను దూరం చేస్తున్నాయి. కుటుంబాలను కకావికలం చేస్తోంది. ఇండియాలో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పరిస్థితి అదుపులోకి రావడానికి ప్రభుత్వం విధించిన కోవింద్ నిబంధనలను విధిగా పాటించాలని వైద్యులు కోరుతున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కరోనా పై విజయం సాధించడానికి ప్రభుత్వానికి సహకరిద్దాం.