గాంధీ మెడికల్ కాలేజీ డేటా ఆపరేటర్ కు కరోనా: ఫ్రోఫెసర్లు, వైద్య సిబ్బందికి పరీక్షలు
గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఆపరేటర్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న పలువురు ప్రోఫెసర్లు, ఆరోగ్య సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకొంటున్నారు.
హైదరాబాద్:గాంధీ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డేటా ఆపరేటర్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న పలువురు ప్రోఫెసర్లు, ఆరోగ్య సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకొంటున్నారు.
హైద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని కరోనా రోగులకు చికిత్స చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.ఈ ఆసుపత్రిలోనే సుమారు 400 మందికి పైగా రోగులు చికిత్స చేస్తున్నారు.
గాంధీ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలో డేటా ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టుగా శుక్రవారం నాడు వైద్యులు నిర్ధారించారు.
మెడికల్ కాలేజీలోని ప్రోఫెసర్లతో పాటు పలువురు మెడికల్ సిబ్బందిని డేటా ఆపరేటర్ కలిసి పనిచేశాడు. గాంధీ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్ లోనే తొలుత ఈ పరీక్షలు నిర్వహించేవారు.
also read::కరోనా ఎఫెక్ట్: రూ. 1500 కోసం బ్యాంకు వద్ద క్యూ లైన్లో నిలబడి మహిళ మృతి
కొంత కాలంగా డేటా ఆపరేటర్ కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో అతని శాంపిల్స్ ను పరీక్థిస్తే ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
డేటా ఆపరేటర్ ఎవరెవరిని కలిశారనే విషయాన్ని కూడ వైద్యులు సేకరిస్తున్నారు. డేటా ఆపరేటర్ కుటుంబసభ్యులను కూడ పరీక్షించే అవకాశం ఉంది.డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా ఎలా సోకిందనే విషయమై కూడ వైద్యులు ఆరా తీస్తున్నారు.