Asianet News TeluguAsianet News Telugu

కరోనా డేంజర్ బెల్స్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్కరోజే 304 మందికి పాజిటివ్..

ఓవైపు దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసుల్లో తగ్గుదల సంతోషాన్ని కలిగిస్తున్నా.. మరోవైపు కొన్ని చోట్ల కరోనా కరాళనృత్యం చేస్తోంది.  ఇలాంటి పరిస్థితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 304 మంది మహమ్మారి బారిన పడినట్లుగా వైద్యాధికారులు ధ్రువీకరించారు.  

corona virus cases rapid spread in nalgond district - bsb
Author
hyderabad, First Published Jun 15, 2021, 9:30 AM IST

ఓవైపు దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసుల్లో తగ్గుదల సంతోషాన్ని కలిగిస్తున్నా.. మరోవైపు కొన్ని చోట్ల కరోనా కరాళనృత్యం చేస్తోంది.  ఇలాంటి పరిస్థితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 304 మంది మహమ్మారి బారిన పడినట్లుగా వైద్యాధికారులు ధ్రువీకరించారు.  

ఆయా మండలాల పరిధిలో నూతన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. భూదాన్ పోచంపల్లి మండలంలో తొమ్మిది మందికి,  జాజిరెడ్డిగూడెం మండలంలో ముగ్గురికి,  కట్టంగూర్ లో ఆరుగురికి, త్రిపురారం మండలం లో ఐదుగురికి, వలిగొండ మండలం లో 20 మందికి, మిర్యాలగూడ లో 34 మందికి,  గుండాల మండలంలో తొమ్మిది మందికి తిరుమలగిరిలో ఐదుగురికి,  చౌటుప్పల్ లో 17 మందికి, భువనగిరిలో 15 మందికి, అడవిదేవులపల్లిలో ఎనిమిది మందికి, దేవరకొండలో ఆరుగురికి,  కేతేపల్లిలో తొమ్మిది మందికి, ఆలేరులో ఆరుగురికి, యాదగిరిగుట్ట  మండలంలో ముగ్గురికి,  చిట్యాల మండలంలో నలుగురికి, నడిగూడెం మండలంలో ఒకరికి, శాలిగౌరారం మండలంలో 18 మందికి,  మోత్కూరులో తొమ్మిది మందికి, నాగార్జునసాగర్ లో 19 మందికి, డిండిలో 11 మందికి, రాజాపేట లో నలుగురికి, మోతెలో పదిమందికి, తుంగతుర్తిలో ఎనిమిది మందికి, బొమ్మలరామారం మండలంలో ఆరుగురికి, నకిరేకల్ లో 35 మందికి,  సంస్థాన్ నారాయణపురంలో ఇద్దరికీ, నాంపల్లి మండలంలో నలుగురికి, అడ్డ గూడూరు లో ఒకరికి, మునుగోడు లో 17 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

అర్వపల్లి :  కరోనా మహమ్మారి సోకి నలుగురు మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలో ఆయా మండల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు… జాజారెడ్డిగూడెం మండలం కాసర్ల పాడు గ్రామంలో కరోనాతో 55 ఏళ్ల వృద్ధురాలు సోమవారం మృతి చెందింది.   ఆమె అంతిమ సంస్కారాన్ని స్వేరో సంస్థ ఆధ్వర్యంలో టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి మచ్చ నరసయ్యతో పాటు మరికొందరు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దబ్బేటి జ్యోతిరాణి, డాక్టర్ రాజేష్, సుజాత, ఎల్లమ్మ, సైదులు, శ్రీనివాస్, భిక్షం పాల్గొన్నారు. 

తిరుమలగిరి లో ఒకరు : తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మూల రాంరెడ్డి (73)కి ఇటీవల వైరస్ సోకింది. కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.  సోమవారం స్వగ్రామంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. 

నాగారంలో వృద్ధుడు :  మండల కేంద్రానికి చెందిన తజ్జం కృష్ణమూర్తి (59) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వారం రోజులుగా హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ  వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా సోకినట్లు నిర్ధారించారు. కృష్ణమూర్తి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

నకిరేకల్లో ఆర్.ఎం.పి:  మండలంలోని నోముల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బుడిదపాడు రామిరెడ్డి(57)కి ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంటివద్దే ఉంటూ చికిత్స పొందుతున్నాడు ఆదివారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు.  రామిరెడ్డి మృతదేహాన్ని టీపీసీసీ  రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ సందర్శించి సంతాపం తెలిపి నివాళులర్పించారు.  సంతాపం తెలిపిన వారిలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాస కరుణాకర్ రెడ్డి,  రవీందర్, రాచకొండ లింగయ్య, వెంకట్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios