Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో 45 ఏళ్లు పైబడినవారికే కరోనా టీకా: నేరుగా వస్తే అంతే సంగతలు

తెలంగాణలో 45 ఏళ్ల వయస్సు పైబడినవారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అది కూడా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇస్తారని ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు చెప్పారు.

Corona vaccine in Telangana only to 45 plus age group
Author
Hyderabad, First Published May 3, 2021, 1:44 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 45 ఏళ్ల వయస్సు పైబడినవారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ముందుగా బుక్ చేసుకున్నవారికే మాత్రమే టీకా అందుబాటులో ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నారు. నేరుగా ఆస్పత్రులకు వస్తే టీకా ఇవ్వబోరని స్పష్టం చేసాయి. 

ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే వాక్యిన్ ఇవ్వనున్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు చెప్పారు రిజిస్ట్రేషన్ చేసుకోనివారికి టీకాలు ఇవ్వడం లేదని ఆయన చెప్పారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల్లోనే వాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు జిహెచ్ఎంసీలోని ఒక్కో కేంద్రంలో రోజుకు 200 మందికి టీకాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. మిగతా చోట్ల ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు వేస్తామని ఆయన చెప్పారు. 

ఈ నెల 1వ తేదీ నుంచి 18-45 ఏళ్ల మధ్య వయస్సుగలవారికి వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే, తగిన వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో తెలంగాణలో ఆ వయస్సు వారికి టీకాలు ఇవ్వడం లేదు. 45 ఏళ్లు పైబడినవారికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios