Asianet News TeluguAsianet News Telugu

కోఠి డీఎంఈ ఆఫీసులో కరోనా వ్యాక్సిన్: రేపు జిల్లాలకు టీకా

కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ హైద్రాబాద్ కు చేరుకొంది. ఈ వ్యాక్సిన్ ను నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయంలో భద్రపర్చారు. ఇక్కడి నుండి రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలకు వ్యాక్సిన్ ను ప్రత్యేకంగా రవాణా చేయనున్నారు వైద్య ఆరోగ్య శాఖాధికారులు.

corona vaccine covishiel reaches to Telangana DME office lns
Author
Hyderabad, First Published Jan 12, 2021, 4:21 PM IST

హైదరాబాద్:కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ హైద్రాబాద్ కు చేరుకొంది. ఈ వ్యాక్సిన్ ను నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయంలో భద్రపర్చారు. ఇక్కడి నుండి రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలకు వ్యాక్సిన్ ను ప్రత్యేకంగా రవాణా చేయనున్నారు

 

corona vaccine covishiel reaches to Telangana DME office lnsవైద్య ఆరోగ్య శాఖాధికారులు.పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుండి  ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మంగళవారం నాడు ఉదయం వ్యాక్సిన్ చేరుకొంది. 

also read:హైద్రాబాద్‌కి చేరుకొన్న కరోనా వ్యాక్సిన్: 1213 సెంటర్లలో వ్యాక్సినేషన్

తెలంగాణలో తొలి విడత కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తొలి విడతలో సుమారు 5 లక్షల  డోసులు తెలంగాణకు రానుంది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్ హైద్రాబాద్ కు చేరుకొంది. 

corona vaccine covishiel reaches to Telangana DME office lns

తెలంగాణ రాష్ట్రంలోని 866 కోల్డ్ స్టోరేజీ పాయింట్ల ద్వారా ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వ్యాక్సిన్ పంపనున్నారు.రాష్ట్రంలోని 1213 వ్యాక్సిన్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన డ్రైరన్ విజయవంతమైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios