తెలంగాణలో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం పది వేల మంది సిబ్బందిని చేశారు.

3 కోట్ల డోసులు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు సైతం అందుబాటులో వుంచేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు దాదాపు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది.

వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్-19 వ్యాక్సిన్‌ కావాలనుకునేవారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. అలాంటివారినే వ్యాక్సిన్ కేంద్రాలకు అనుమతించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. స్పాట్ రిజిస్ట్రేషన్‌ లాంటి వాటికి అవకాశం లేదని పేర్కొంది.