తెలంగాణ రాష్ట్రంలో  ఆదివారం నాడు మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారి సంఖ్య 22కు చేరింది.


ఏపీ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన ఓ యువకుడు లండన్ నుండి దుబాయ్  మీదుగా హైద్రాబాద్ కు వచ్చాడు. అతడికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు.

హైద్రాబాద్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు.  అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటికే 21 మందికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

Also read:కరోనా ఎఫెక్ట్: కరీంనగర్ లో ఇండోనేషియా బృందానికి ఆశ్రయమిచ్చిన వ్యక్తి అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు ఎక్కడెక్కడ తిరిగారనే అనే సమాచారాన్ని కూడ సేకరిస్తున్నారు. పాజిటివ్ లక్షణాలు కలిగి ఉన్న వారిని ఎవరెవరు కలిశారో వారికి కూడ ముందుజాగ్రత్తగా చికిత్స అందిస్తున్నారు.

విదేశాల నుండి వచ్చేవారిపై తెలంగాణ ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసింది.