కరోనా ఎఫెక్ట్: కరీంనగర్ లో ఇండోనేషియా బృందానికి ఆశ్రయమిచ్చిన వ్యక్తి అరెస్ట్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇండోనేషియా వాసులకు ఆశ్రయం ఇచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నామని కరీంనగర్ కమిషనర్ కమల్‌హసన్ రెడ్డి ప్రకటించారు. 

police arrested zameel in karimnagar district

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇండోనేషియా వాసులకు ఆశ్రయం ఇచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నామని కరీంనగర్ కమిషనర్ కమల్‌హసన్ రెడ్డి ప్రకటించారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇండోనేషియా నుండి ఓ ప్రతినిధి బృందం వచ్చింది.ఈ బృందం సభ్యులకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. అయితే ఈ బృందానికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి కూడ పాజిటివ్ లక్షణాలు కూడ ఉన్నాయని రిపోర్టులు తేల్చి చెప్పాయి.

also read:కరోనా దెబ్బ: ఒకే రోజు ఇద్దరు మృతి, ఇండియాలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

ఇండోనేషియా బృందానికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న విషయం తేలింది. అయితే అతను ఐసోలేషన్ కు పరిమితం కాకుండా తప్పించుకు తిరిగాడు.

తప్పించుకొని తిరుగుతున్న ఆ వ్యక్తిని శనివారం నాడు రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కరీంనగర్ పట్టణంలో పెద్ద ఎత్తున పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉండడంతో జిల్లా యంత్రాంగం కూడ జాగ్రత్తలు తీసుకొంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios