తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. యధావిధిగానే కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 23 వేలు దాటింది. హైదరాబాదులో ఎప్పటిలాగే కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. ఎప్పటిలాగే గత 24 గంటల్లో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2924 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ల్కషా 23 వేల 090కి చేరుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా పది మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 818కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 1638 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 90988కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 31284 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

హైదరాబాదులో ఎప్పటిలాగే గత 24 గంటల్లో 400కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో గత 24 గంటల్లో 181 కేసులు నమోదయ్యాయి.

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా కేసులు

ఆదిలాబాద్ 36
భద్రాద్రి కొత్తగూడెం 88
జిహెచ్ఎంసి 461
జగిత్యాల 92
జనగామ 46
జయశంకర్ భూపాలపల్లి 24
జోగులాంబ గద్వాల 35
కామారెడ్డి 56
కరీంనగర్ 172
ఖమ్మం 181
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 10
మహబూబ్ నగర్ 58
మహబూబాబాద్ 80
మంచిర్యాల 91
మెదక్ 45
మేడ్చెల్ మల్కాజిగిరి 153
ములుగు 34
నాగర్ కర్నూలు 51
నల్లగొండ 171
నారాయణపేట 13
నిర్మల్ 33
నిజామాబాద్ 140
పెద్దపల్లి 83
రాజన్న సిరిసిల్ల 55
రంగారెడ్డి 213
సంగారెడ్డి 44
సిద్ధిపేట 97
సూర్యాపేట 118
వికారాబాద్ 15
వనపర్తి 46
వరంగల్ రూరల్ 17
వరంగల్ అర్బన్ 102
యాదాద్రి భువనగిరి 64
మొత్తం కేసులు 2924

Scroll to load tweet…