సిరిసిల్ల: కరోనా అంటే గజగజ వణికిపోతున్న ప్రజలను ఓ కరోనా రోగి చుక్కలు చూపించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ నుండి పరారయిన ఓ కరోనా రోగి  వేములవాడలో ప్రత్యక్షమయ్యాడు. నడిరోడ్డుపై నానా హంగామా చేస్తూ వేములవాడ వాసులను భయాందోళనకు గురిచేశాడు. 

మూడు రోజుల క్రితం ఇదే జిల్లాలోని అగ్రహారం గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా సోకింది. దీంతో అతడికి వైద్యాధికారులు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతడు హాస్పిటల్ సిబ్బంది కళ్లుగప్పి అక్కడినుండి పరారయ్యాడు. 

వీడియో

https://telugu.asianetnews.com/telangana/telangana-woman-gets-corona-positive-without-testing-qdt1rr"

అక్కడినుండి ఎలాగో వేములవాడకు చేరుకున్న అతడు రాజరాజేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద రోడ్డుపై హల్చల్ చేశాడు. రోడ్డుపై తిరిగే వాహనదారులు, పాదచారులను హడలెత్తించాడు. వారిని తాకడానికి ప్రయత్నిస్తూ భయపెట్టాడు.  

స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా అతడివద్దకు వెళ్లే సాహసం మాత్రం చేయడంలేదు. పిపిఈ కిట్లు లేకుండా అతడి వద్దకే వెళితే కరోనా సోకే అవకాశం వుండటంతో వారుకూడా భయపడుతున్నారు.  దీంతో కరోనా రోగి రోడ్డుపక్కనే తాపీగా కూర్చుని వచ్చిపోయే వారిని భయాందోళనకు గురిచేస్తున్నాడు.