Asianet News TeluguAsianet News Telugu

'ఇంటికి పోదాం లేవయ్యా'..హృదయాల్ని మెలిపెట్టిన ఓ భార్య రోదన..

రోజురోజుకూ కరోనా తీవ్రత పెరిగిపోతుండడంతో వైరస్ భయంతో మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. అప్పటివరకు తమతో ఉన్న ఆప్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతుండడంతో వారి బంధువుల రోధనలు మిన్నంటుతున్నాయి.

corona fear caused death of a man in nizamabad - bsb
Author
Hyderabad, First Published Apr 26, 2021, 11:24 AM IST

రోజురోజుకూ కరోనా తీవ్రత పెరిగిపోతుండడంతో వైరస్ భయంతో మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. అప్పటివరకు తమతో ఉన్న ఆప్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతుండడంతో వారి బంధువుల రోధనలు మిన్నంటుతున్నాయి.

తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి విషాద ఘటనే జరిగింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం వాసి అశోక్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరం తగ్గకపోతుండడంతో ఎందుకైనా మంచిదని కరోనా పరీక్ష చేయించుకోవాలనుకున్నాడు. 

కరోనా పరీక్ష కోసం రెంజల్ పీహెచ్‌సీకి వెళ్లాడు. టెస్ట్ చేయించుకుని ఫలితం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో పాజిటివ్ వస్తే ఎలా.. తన పరిస్థితి ఏంటి అనే భయం.. అందరూ వెలివేస్తారేమో అనే ఆందోళన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అంతే కూర్చున్న చోట అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

ఫలితం కోసం గాబరా పడుతూ.. మరణించాడు.. అయితే అతను చనిపోయిన తరువాత వచ్చిన ఫలితంలో కరోనా లేదని తేలింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  అతనికి తోడుగా వచ్చిన భార్య అతని మరణాన్ని తట్టుకోలేక గుండెలు పగిలేలా ఏడ్వడం అక్కడివారందరినీ కలిచివేసింది. 

పీహెచ్‌సీ ప్రాంగణంలో ఆమె 'ఇంటికి పోదాం లేవయ్యా' అంటూ అశోక్ ను పట్టుకుని.. లేపుతూ రోదించడం అందరి హృదయాల్నీ మెలిపెట్టింది. 

Follow Us:
Download App:
  • android
  • ios