తెలంగాణలో  గత కొద్ది రోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం రేపింది. అక్కడ గత కొద్ది రోజుల్లో 20 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం రేపింది. అక్కడ గత కొద్ది రోజుల్లో 20 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తొలుత యూనివర్సిటీలో విద్యార్థులు జ్వరాల బారినపడటంతో.. వారికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 17 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అయితే తాజాగా మరో ముగ్గురు విద్యార్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో యూనివర్సిటలో కేసుల సంఖ్య 20కి చేరింది. కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణలో బుధవారం కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొత్తం 36,764 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 852 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా థర్డ్ వేవ్ తర్వాత ఒకే రోజులో 800 కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. మరోవైపు 640 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

తాజా కేసులలో.. జీహెచ్ఎంసీ పరిధిలో 358) మేడ్చల్ మల్కాజిగిరిలో 63, రంగారెడ్డిలో 57, పెద్దపల్లిలో 35, మహబూబాబాద్‌లో 32, ఖమ్మంలో 28, హన్మకొండలో 26, నల్గొండలో 26, జనగాంలో 26, కరీంనగర్‌లో 24, కరీంనగర్‌లో 24 ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,16,531కి పెరిగింది. వీరిలో 8,07,505 మంది బాధితులు కోలుకోగా.. 4,111 మంది కరోనాతో మృతిచెందారు.