కరీంనగర్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ భయానక పరిస్థితులను సృష్టిస్తోంది. కొన్ని జిల్లాల్లో అయితే కేసుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇలా కరోనా వ్యాప్తి అధికంగా వున్న జిల్లాల్లో కరీంనగర్ ఒకటి. దీంతో కరీంనగర్ జిల్లాలో కోవిడ్ పరిస్థితులపై శుక్రవారం సాయంత్రం ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కలెక్టర్ శశాంకతో ఫోన్లో ఆరా తీశారు. కలెక్టర్ తో పలు విషయాలు చర్చించడమే కాదు సూచనలు కూడా చేశారు సంజయ్. 

కరీంనగర్ జిల్లాలో ప్రస్తుత కరోనా కేసుల స్థితిగతులను కలెక్టర్ ద్వారా తెలుసుకున్న సంజయ్... అందుకు తగిన సూచనలు చేశారు.రోజు రోజుకి కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మందులు, ఆక్సిజన్ కొరత రానివ్వకుండా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ను కోరారుఎంపీ. 

read more  నైట్ కర్ఫ్యూతో కేసులు ఎక్కడ తగ్గాయి:తెలంగాణ సర్కార్‌కి హైకోర్టు ప్రశ్నల వర్షం

కోవిడ్ పరిస్థితులపై జిల్లా యంత్రాంగం ఇప్పటికే పటిష్ట చర్యలు చేపట్టడం, తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు.  రెండవ స్టేజి కరోనా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్ననందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంజయ్ కోరారు. అవసరమైతే తప్ప బయట తిరగవద్దని... అధికారులకు ప్రజలంతా సహకరించాలని ఎంపీ సంజయ్ పిలుపునిచ్చారు.