తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 226 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,92,621కి చేరింది. 

1584 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 3,920 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,86,894 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 54 కరోనా కేసులు నమోదయ్యాయి.