హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనంలో నిఘా వైఫల్యం బయటపడింది.  బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 12లో నిర్మాణంలో ఉన్న పోలీస్‌ కంట్రోల్‌ భవనంలో భారీ చోరీ జరిగింది. 38 కాపర్‌ వైర్‌ బండిల్స్‌ను  దుండగులు చోరీ చేశారు.

హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనంలో నిఘా వైఫల్యం బయటపడింది. బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 12లో నిర్మాణంలో ఉన్న పోలీస్‌ కంట్రోల్‌ భవనంలో భారీ చోరీ జరిగింది. 38 కాపర్‌ వైర్‌ బండిల్స్‌ను దుండగులు చోరీ చేశారు. చోరీకి గురైన కాపర్ వైర్ విలువ దాదాపు రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా. ఈ చోరీకి సంబంధించి సంబంధించి ప్రాజెక్టు మేనేజర్ సురేష్ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. ప్రాజెక్టు మేనేజర్ సురేష్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ చోరీకి పాల్పడింది అక్కడ పనిచేసే వ్యక్తులేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొన్ని వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఓ భవన నిర్మాణ కార్మికుడు కాపర్ వైర్ బండిల్స్‌ను అధిక విలువకు విక్రయించడానికి దొంగిలిస్తున్నారని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. అయితే ఈ చోరీ ఘటనలో ఇంకా ఎవరి ప్రమేయం ఏమైనా ఉందా విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక, హైదరాబాద్ లోని ప్రతి ప్రాంతంపై అనువనువు నిఘా పెట్టేందుకు, ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో పసిగట్టేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని నిర్మిస్తున్నారు.