Asianet News TeluguAsianet News Telugu

టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు సుప్రీం షాక్: కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ

 తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ధిక్కరణ నోటీసులిచ్చింది. 
 

contempt of court notice issues Supreme court to TS Genco and Transco lns
Author
Hyderabad, First Published Jun 29, 2021, 3:43 PM IST

హైదరాబాద్: తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ధిక్కరణ నోటీసులిచ్చింది. తమను విధుల్లో చేరేందుకు అనుమతి ఇవ్వటం లేదని 84మంది ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఉద్యోగుల పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం నాడు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. 

 1,150 మంది ఉద్యోగులను 2 రాష్ట్రాలకు 50 శాతం చొప్పున పంపిణీ చేశారు.ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం 655 మందిని ఏపీ ప్రభుత్వం విధుల్లోకి తీసుకొంది. .84 మందిని మినహాయించి మిగిలిన వారిని తెలంగాణ ప్రభుత్వం చేర్చుకోగా వీరంతా ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో పాటు ఎస్పీడీసీఎల్​  సీఎండీ రఘుమారెడ్డి, కార్పొరేట్‌ కార్యాలయ అధికారి గోపాలరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసు విచారణను జులై 16కి వాయిదా వేసింది.రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచారు. ఉద్యోగుల పంపిణీ విషయంలో కేంద్రం కమిటీలను కూడ ఏర్పాటు చేసింది.ఈ కమిటీలు ఉద్యోగుల విభజన అంశాన్నిచూశాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios