Asianet News TeluguAsianet News Telugu

వైద్యుల నిర్లక్ష్యంతో పురిటి బిడ్డకు అంగవైకల్యం... హైదరాబాద్ లోని కార్పోరేట్ హాస్పిటల్ కు భారీ జరిమానా

నిడు గర్భిణికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కార్పోరేట్ హాస్పిటల్ కు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా విధించింది.

consumer forum fined 60 lakhs to fernandez hospital in hyderabad
Author
Hyderabad, First Published Jun 29, 2022, 12:16 PM IST

హైదరాబాద్ : ప్రజలు ప్రాణాలను కాపాడే వైద్యులను దేవుళ్లుగా, హాస్పిటల్స్ ను దేవాలయాలుగా భావిస్తుంటారు. అలాంటిది కొందరు డాక్టర్లు ప్రాణాలంటే లెక్కలేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పవిత్రమైన వైద్యవృత్తికే కలంకం తెస్తుంటారు. ఇలా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ల నిర్లక్ష్యం ఓ చిన్నారిని జీవితాంతం అంగవైకల్యంతో బాధపడేలా చేసింది. తాజాగా చిన్నారి జీవింతంతో ఆడుకున్న సదరు హాస్పిటల్ పై వినియోగదారుల ఫోరం భారీ ఫైన్ విధించింది. 

వివరాల్లోకి వెళితే...  2019 ఫిబ్రవరి 14న హైదరాబాద్ నగరంలోని ఫెర్నాండెజ్ హాస్పిటల్లో నిండు గర్భిణి శిరీష ప్రసవం కోసం చేరింది. అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు నార్మల్ డెలివరీ చేయవచ్చని చెప్పారు. ఏమయ్యిందో తెలీదుగానీ ఆ తర్వాతి రోజే అంటే పిబ్రవరి 15న అత్యవసరంగా సిజెరియన్ చేసారు.  

సిజెరియన్ సమయంలోనూ డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని... వీరి తప్పిదం కారణంగా ఆరోగ్యంగా పుట్టాల్సిన బిడ్డ అంగవైకల్యంతో పుట్టిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై బాధిత తల్లిదండ్రులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. పెర్నాండెజ్ హాస్పిటల్లో డెలివరీ సమయంలో అందిన వైద్యం, మెడికల్ రిపోర్టులను బాధితురాలు ఫోరంకు అందించింది. దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం హాస్పిటల్ నిర్లక్ష్యమే చిన్నారి అంగవైకల్యానికి కారణంగా తేల్చారు. దీంతో బాధిత మహిళకు రూ.60 లక్షల పరిహారం చెల్లించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. 

ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ లో వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో పురిట్లోనే బిడ్డ ప్రాణాలు కోల్పోయిన మరో ఘటన వెలుగుచూసింది.  వైద్య సిబ్బంది పార్టీలో మునిగితేలుతూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిండు గర్భిణి నరయాతన అనుభవించింది. తల్లీ బిడ్డ ప్రాణాలకంటే తమ ఎంజాయ్ మెంటే ముఖ్యమని హాస్పిటల్ సిబ్బంది భావించడంతో కళ్లు తెరవకుండానే శిశువు మృతిచెందింది. తల్లి పరిస్థితి విషమంగా వుంది. 

హైదరాబాద్ చాదర్ ఘాట్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ కూతురు పెళ్లి వచ్చేనెలలో వుంది. దీంతో అతడు ముందుగానే హాస్పిటల్ సిబ్బందికి పార్టీ ఏర్పాటు చేసాడు. హాస్పిటల్ భవనంలోనే టెర్రస్ పై హాస్పిటల్ సిబ్బంది పెద్ద సౌండ్ తో డిజె పెట్టుకుని డ్యాన్సులు చేసారు. ఇలా విందు చిందులతో ఎంజాయ్ చేసారు.

ఇలా హాస్పిటల్ సిబ్బంది పార్టీలో మునిగిపోయి వుండగా నిండు గర్భిణి పురిటినొప్పులతో హాస్పిటల్లో చేరింది. గర్భిణి నరకయాతన అనుభవిస్తున్నా హాస్పిటల్ సిబ్బంది ఏమాత్రం కనికరం ప్రదర్శించలేరు. అంతకంతకూ మహిళ పరిస్థితి మరింత విషమంగా మారుతున్నా పార్టీలోంచి వచ్చి వైద్యం చేయడానికి ఇష్టపడలేదు. ఇలా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కళ్ళు తెరిచి లోకం చూడకుండానే శిశువు మృతి చెందింది. తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం. 

వైద్యుల నిర్లక్ష్యమే పసిగుడ్డు ప్రాణాలు తీయడమే కాదు తల్లిని కూడా ప్రాణాపాయ స్థితిలోకి నెట్టడంపై బాధిక కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ వద్దకు భాదిత కుటుంబం, బంధువులు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చాదర్ ఘాట్ పోలీసులు రంగంలోకి దిగి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 


 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios