మద్యం మత్తులో   కానిస్టేబుల్   సింగరేణి ఉద్యోగి సమ్మయ్యను చికతబాదాడు. ఈ ఘటన  రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో  చోటు  చేసుకుంది. 

రామగుండం: మద్యం మత్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ సింగరేణి ఉద్యోగిని చితకబాదిన ఘటన పెద్దపెల్లి జిల్లా కమాన్‌పూర్ లో ఆదివారంనాడు చోటుచేసుకుంది. రామగుండం కమిషనర్ కమీషనరేట్ పరిధిలోని ఎన్టిపిసి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అజయ్ బంధువుతో కలిసి కమాన్‌పూర్ లోని ఓ వైన్స్ షాపులో మద్యం సేవించాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అనంతరం తన బైక్ పై వెళ్లే క్రమంలో సింగరేణి ఉద్యోగి బైక్ ను ఢీకొట్టాడు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ అజయ్ కుమార్ 'నా వాహనాన్ని ఢీ కొడతావా 'అంటూ సింగరేణి ఉద్యోగి సమ్మయ్యను కాలుతో తన్నుతూ చితకబాదాడు. 

స్థానికులు కానిస్టేబుల్ ను ఆపే ప్రయత్నం చేసిన వినిపించుకోలేదు. ఘటన స్థలానికి వచ్చిన కమాన్‌పూర్ పోలీసులతో సైతం సదరు కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధితుడు సమ్మయ్య కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్ అజయ్ అతని బందువు గణేష్ ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రస్తుతం సింగరేణి ఉద్యోగి సమ్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.