పదో  తరగతి ఫలితాల్లో అవిభక్త కవలలు వీణ-వాణి టాప్ ప్లేస్ నిలిచారు. వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 సీపీఏ స్కోర్ సాధించారు. మార్చిలో జరిగిన మొదటి మూడు పరీక్షలకు వీణ వాణి హాజరయ్యారు. మధురానగర్‌లోని ప్రతిభ హైస్కూల్‌లో వేర్వేరు హాల్ టికెట్లలో పరీక్షలు రాశారు. 

వీణ వాణిని ప్రత్యేక వాహనంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ఇంటర్‌లో చేరేందుకు వీరిద్దరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్) చదవాలనుకుంటున్నారు. భవిష్యత్తులో కంప్యూటర్ రిలేటెడ్ జాబ్‌ చేయాలని వీణ-వాణి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణ విద్యార్థులకు తీసిపోకుండా వీరిద్దరు మంచి స్కోర్లు సాధించడంతో అందరూ శభాష్ అంటున్నారు. వీరు మూడు పరీక్షలకు హాజరయినప్పటికి మరో మూడు పరీక్షలు మార్కులు వీరి ఇంటర్నల్ అస్సెస్ మెంట్ మార్కుల ద్వారా ఇవ్వబడ్డాయి. పదవ తరగతి పూర్తి చేసుకున్నా వీళ్ళు ఇప్పుడు ఇంటర్ లో ఎం‌ఈ‌సి చేసేందుకు నిశ్చయించుకున్నారు.