Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డికి షాక్, టీడీపీకి మెుండి చెయ్యి

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది. రెండు జాబితాల్లో తన అనుచరులకు టిక్కెట్లు దక్కలేదని ఆగ్రహంతో ఉన్నరేవంత్  రెడ్డి మూడో జాబితా పుండు మీద కారం చల్లినట్లైంది. మూడో జాబితాలో తన అనుచరులకు ఒక్కరికీ టిక్కెట్లు కేటాయించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

congress working president unsatisfied third list
Author
Hyderabad, First Published Nov 17, 2018, 1:27 PM IST

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది. రెండు జాబితాల్లో తన అనుచరులకు టిక్కెట్లు దక్కలేదని ఆగ్రహంతో ఉన్నరేవంత్  రెడ్డి మూడో జాబితా పుండు మీద కారం చల్లినట్లైంది. మూడో జాబితాలో తన అనుచరులకు ఒక్కరికీ టిక్కెట్లు కేటాయించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

తనతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేతలకు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే రేవంత్ రెడ్డి కండీషన్ పెట్టారు. అయితే మహాకూటమి పొత్తులో భాగంగా రేవంత్ అడిగిన సీట్లు కేటాయించడం అసాధ్యమైంది. నిజామాబాద్‌ జిల్లాలో తన వర్గానికి కనీసం రెండు సీట్లు అయినా కేటాయించాలని రేవంత్‌ రెడ్డి పట్టుపట్టారు. 

తనతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆరికెల నర్సారెడ్డి, కామారెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుభాష్ రెడ్డిలకు టిక్కెట్లు ఇవ్వాలని రేవంత్ పట్టుబట్టారు. ఆరికెల నర్సారెడ్డికి నిజామాబాద్ రూరల్, సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి టికెట్లను ఇవ్వాలని కోరారు. 

అయితే రెండు జాబితాల్లోనూ రేవంత్ రెడ్డి అనుచరుల పేర్లు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి బుజ్జగించారు కూడా. తొందరపడొద్దని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.   

అయితే మూడో జాబితాలో తాను ఆశించిన రెండు సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులకే కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి జాజల సురేందర్‌, నిజామాబాద్‌ రూరల్‌ రేకుల భూపతిరెడ్డిలకు కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసింది. 

అటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సూర్యాపేట నియోజకవర్గం నుంచి తన అనుచరుడు పటేల్ రమశే రెడ్డికి టిక్కెట్ ఇస్తుందని ఆశించారు. అది కూడా ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని అనుచరుల వద్ద వాపోతున్నారట.  

ఇకపోతే మూడో జాబితాపైనా టీడీపీ గుర్రుగా ఉంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని, బాల్కొండ స్థానాలను టీడీపీ ఆశించింది. మూడో జాబితా వారి ఆశలను ఆడియాశలు చేస్తూ కాంగ్రెస్ హ్యాండిచ్చింది. ఆ రెండు స్థానాలను కాంగ్రెస్ తమ అభ్యర్థులనే ఎంపిక చేసింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. 

ఈ వార్తలు కూడా చదవండి

మర్రి శశిధర్ రెడ్డికి షాక్: కాంగ్రెసు మూడో జాబితా ఇదే...

కాంగ్రెస్ లో సీట్ల లొల్లి: పార్టీ మారే యోచనలో మర్రి శశిధర్ రెడ్డి...?

Follow Us:
Download App:
  • android
  • ios