కొడంగల్: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే ముందు కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని పిలుపునిచ్చారు. 

చింతమడక ఛీటర్ కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. తనను ఓడించేందుకు రూ.100 కోట్ల మూటతో పట్నం ముఠాలను కొడంగల్ పంపించారని రేవంత్ ఆరోపించారు. 

టీఆర్ ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా ఎన్నికోట్లు కుమ్మరించినా కొడంగల్‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని  ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ నమ్మకాన్ని నిలబెడతామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని అందులో ఎలాంటి సందేహామే లేదన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని రేవంత్ భరోసా ఇచ్చారు.