హైదరాబాద్: తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో వివరాలు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్ కేసులు పొందుపర్చేందుకు  వివరాలు  అడిగితే అధికారులు ఇవ్వడం లేదిన రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ఈ విషయమై ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగిన కూడ ఇవ్వని పరిస్థితి నెలకొందని  ఆ పిటిషన్‌లో రేవంత్ రెడ్డి ఆరోపించారు.

తనపై పోలీసులు  అక్రమంగా కేసులు  పెడుతున్నారని ఆయన ఆరోపించారు.  తనపై నమోదైన కేసుల వివరాలను  చెప్పాలని  కోరుతూ తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్‌లను ప్రతివాదులుగా చేర్చుతూ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను  హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసు విచారణను  నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.  ఇటీవలనే  భద్రత విషయంలో హైకోర్టును ఆశ్రయించడంతో రేవంత్ కు 4+4 గన్‌మెన్ల భద్రతను  ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

రేవంత్‌కు సెక్యూరిటీ పెంపు: 4+4 గన్‌మెన్లతో భద్రత

రేవంత్‌కి భద్రతను పెంచమన్న హైకోర్టు.. కేంద్రానిదే బాధ్యత