కోదాడ జిల్లా హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు రేవంత్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్‌ నాయకులు అన్నెం కొండారెడ్డి, టీడీపీ నాయకులు కర్నె రామ్మోహన్‌రెడ్డితోపాటు ఆపార్టీలకు చెందిన పలువురు నాయకులు రేవంత్‌రెడ్డిని కలిశారు. 

హుజూర్‌నగర్‌ : భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తెలుగుదేశంతో కలిసి ఉమ్మడిగా పోరాటం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లో తననను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. 

కోదాడ జిల్లా హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు రేవంత్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్‌ నాయకులు అన్నెం కొండారెడ్డి, టీడీపీ నాయకులు కర్నె రామ్మోహన్‌రెడ్డితోపాటు ఆపార్టీలకు చెందిన పలువురు నాయకులు రేవంత్‌రెడ్డిని కలిశారు. 

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వేపలసింగారం గ్రామపంచాయతీలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన విషయాన్ని రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ విజయానికి కృషిచేసిన నేతలను రేవంత్‌రెడ్డి అభినందించారు. అలాగే భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లోనూ ఉమ్మడిగా కృషిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి తోడ్పడాలని రేవంత్‌‌రెడ్డి సూచించారు.