కేసిఆర్ పై కాంగ్రెస్ విహెచ్ ఫైర్

congress vh fire on kcr
Highlights

ఆర్టీసి కార్మికులను బెదిరిస్తవా? 

ఆర్టీసీ కార్మికులను సిఎం కేసిఆర్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఎఐసిసి సెక్రటరీ వి.హన్మంత రావు. ఉద్యోగాలు తీసేస్తాం అని సీఎం ఆర్టీసీ కార్మికులను బయపెడితే సహించేది లేదన్నారు. ఓట్ల కోసం అడగకున్నా కుల సంఘాలకు 5కోట్లు, 5ఎకరాలు ఇస్తున్నాడని విమర్శించారు. కానీ న్యాయంగా రావాల్సిన సాలరీస్ కోసం అడిగితే ఆర్టీసీ ఉద్యోగులను బయపెడుతున్నాడు కేసీఆర్ అని మండిపడ్డారు.

రోడ్ల పైన కూడా ప్రజలకు అన్యాయంగా ఫైన్లు వేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బంది కలిగే పనులను కేసిఆర్ ప్రభుత్వం తక్షణమే మానుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పీసీసీ ఆలోచిస్తుందన్నారు. 11న రాహుల్ గాంధీ సమక్షం లో నేషనల్ OBC కమిటీ మీటింగ్ ఉందని చెప్పారు. 2019 ఎన్నికలలో కలసి ఉంటే కలదు సుఖం అనే నినాదం తో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు విహెచ్.

loader