పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం నాడు సమావేశం కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.
సంగారెడ్డి: Congress పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy శుక్రవారం నాడు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణపై జగ్గారెడ్డి కార్యకర్తలతో చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నానని జగ్గారెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కు Resign చేయాలని నిర్ణయం తీసుకొన్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే పార్టీ సీనియర్లు కొందరు ఈ విషయమై జగ్గారెడ్డితో phone లో చర్చించారు. దీంతో జగ్గారెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని 15 రోజుల పాటు వాయిదా వేసుకొన్నారు. అయితే ఇవాళ పార్టీ కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జగ్గారెడ్డి కార్యకర్తలకు ఏం చెబుతారనేది ప్రస్తుతం రాజకీయవర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.
గురువారం నాడు CLP నేత Mallu Bhatti Vikramarka సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలను జగ్గారెడ్డి వారితో చర్చించారు. రాజీనామాపై పార్టీ నేతలు జగ్గారెడ్డితో చర్చించారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే పార్టీ చీఫ్ Sonia Gandhi, Rahul Gandhiతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్, ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ లను కూడా కలవాలని జగ్గారెడ్డి భావిస్తున్నారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ సీనియర్లు తనకు సమయం కేటాయించే అవకాశం ఉందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇవాళ సమావేశంలో తాను కార్యకర్తలతో తాను చెప్పాలనుకొన్న అంశాలను చెబుతానని చెప్పారు. అయితే అన్నీ విషయాలను కూడా క్యాడర్ కు చెప్పలేనని జగ్గారెడ్డి వివరించారు.తన విషయమై టీపీసీసీ చీఫ్ Revanth Reddy చేసిన వ్యాఖ్యల ను కూడా జగ్గారెడ్డి తప్పుబట్టారు.
జగ్గారెడ్డి వ్యవహారాన్ని కుటుంబంలో సమస్యగా చెప్పిన రేవంత్ రెడ్డి.. అన్ని సమస్యలను తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. మీడియా ఈ అంశాన్ని పెద్దగా చూపాల్సిన అవసరం లేదన్నారు. టీ కప్పులో తుపాను మాదిరే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని చెప్పారు. తమ పార్టీలో విభేదాలు లేవని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు.
తనను టీఆర్ఎస్ కోవర్ట్ అంటున్నారని ఈ అవమానాలను భరించలేనని పేర్కొంటూ జగ్గారెడ్డి ఈ నెల 19న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఆయన లేఖలు రాశారు.
పార్టీ వీడినా గాంధీ కుటుంబంపై గౌరవం తో ఉంటానని.. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తానని ఆయన చెప్పారు. పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 2017లో ఎవ్వరూ అధినేత రాహుల్ గాంధీ సభ పెట్టడానికి ముందుకు రాకుంటే తాను కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహించానని. ఆయన గుర్తు చేశారు.
