Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 18న కొండగట్టునుండి కాంగ్రెస్ బస్సు యాత్ర: ప్రారంభించనున్న రాహుల్


బస్సు యాత్రపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చింది.ఈ నెల  18 నుండి యాత్రను ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.రాహుల్, ప్రియాంకగాంధీలు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.

 Congress Telangana Leaders To Conduct Bus yatra From October 18 lns
Author
First Published Oct 13, 2023, 12:31 PM IST | Last Updated Oct 13, 2023, 12:53 PM IST

హైదరాబాద్: ఈ నెల  18వ తేదీ నుండి  బస్సు యాత్ర నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.  కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం నుండి  బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ లు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.

తొలుత ఈ నెల  15 నుండి బస్సు యాత్ర నిర్వహించాలని  కాంగ్రెస్ నేతలు భావించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి యాత్రను ప్రారంభించాలని ఆ పార్టీ తలపెట్టింది.ఈ విషయమై  రెండు రోజుల క్రితం జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించారు.  ప్రియాంక, రాహుల్ గాంధీలు బస్సు యాత్రలో పాల్గొనేలా  రూట్ మ్యాప్ ను సిద్దం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇవాళ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు న్యూఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ బస్సు యాత్ర విషయమై పార్టీ అగ్రనేతలతో చర్చించారు. ఈ ప్రియాంక, రాహుల్ గాంధీలు ఈ నెల  18న  బస్సు యాత్ర ప్రారంభంలో పాల్గొనేందుకు అంగీకరించారు. దీంతో కొండగట్టు నుండి యాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

కొండగట్టు నుండి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఉత్తర తెలంగాణలో  బస్సు యాత్ర సాగేలా రూట్ మ్యాప్ ను పార్టీ నాయకత్వం సిద్దం చేయనుంది.ఉత్తర తెలంగాణలో  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఆరు గ్యారంటీ స్కీమ్ లతో పాటు  ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చనున్న అంశాలపై కూడ కాంగ్రెస్ నేతలు హామీలు ఇవ్వనున్నారు.

also read:ఈ నెల 15 నుండి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర: ప్రియాంక, రాహుల్ పాల్గొనేలా ప్లాన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 9వ తేదీన విడుదలైంది. నవంబర్ 30 పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.ఈ దఫా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని  కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. కర్ణాటకలో దక్కించుకొన్న తరహాలోనే తెలంగాణలో కూడ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. గత కొంతకాలంగా  రాష్ట్రంలో  పార్టీ పరిస్థితిపై  ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోల్  సర్వే వివరాలను పార్టీ నాయకత్వానికి అందిస్తున్నారు. సునీల్ కనుగోలు నివేదికల ఆధారంగా రాష్ట్ర నాయకత్వానికి రాహుల్ దిశా నిర్ధేశం చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios