రేవంత్‌పై సంచలన ఆరోపణలు.. కొత్త మనోహర్ రెడ్డిపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు..
తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పార్టీ నుంచి కొత్త మనోహర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. కొత్త మనోహర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పార్టీ నుంచి కొత్త మనోహర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. కొత్త మనోహర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త మనోహర్ రెడ్డి ఇటీవలే హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మహేశ్వరం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయితే తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొత్త మనోహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నారని.. మహేశ్వరం టికెట్ కోసం ఆయన బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి నుంచి రూ.10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నారని ఆరోపించారు. ఇదే విషయం తనకు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ చెప్పారని.. సమయం వచ్చినప్పుడు సాక్ష్యాలతో అన్ని బయట పెడతానని చెప్పుకొచ్చారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే కొత్త మనోహర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది.