హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు

మల్కాజిగిరి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో   సర్వే సత్యనారాయణ  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహేష్ కుమార్ పై వాటర్ బాటిల్ ను ఆయన విసిరాడు.

ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది.  సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ  ప్రాధాన్యత ఇచ్చినా కూడ పార్టీ సీనియర్ నేతల పట్ల సర్వే సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ  సీరియస్‌గా తీసుకొంది. పార్టీ అధిష్టానం సూచన మేరకు  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటేసింది.