Asianet News TeluguAsianet News Telugu

సీసీఎస్ పోలీసుల నోటీస్: స్టే ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో సునీల్ కనుగోలు పిటిషన్

కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త  సునీల్  కనుగోలు  గురువారం నాడు  తెలంగాణ  హైకోర్టును ఆశ్రయించారు.  తనకు  సీసీఎస్ పోలీసులు  ఇచ్చిన 41 ఏ సీఆర్ పీసీ నోటీసుపై స్టే ఇవ్వాలని  ఆయన ఆ పిటిషన్ లో కోరారు. 

congress Strategist Sunil kanugolu files petition for stay on Telangana CCS Police notice
Author
First Published Dec 29, 2022, 12:35 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త  సునీల్ కనుగోలు  గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు  హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన  41 ఏ సీఆర్‌పీసీ నోటీసులపై  స్టే ఇవ్వాలని కోరుతూ  సునీల్ కనుగోలు  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల  27వ తేదీన సునీల్ కనుగోలుకు మరోసారి  హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు  నోటీసులు ఇచ్చారు.ఈ నోటీసులను  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  మల్లు రవి అందుకున్నారు.  ఈ నెల  30వ తేదీన  విచారణకు రావాలని  ఆ నోటీసులో  సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో  ఇవాళ తెలంగాణ హైకోర్టులో సునీల్ కనగోలు  పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నెల  27వ తేదీన సునీల్ కనుగోలుకు మరోసారి  హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు  నోటీసులు ఇచ్చారు.ఈ నోటీసులను  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  మల్లు రవి అందుకున్నారు.  ఈ నెల  30వ తేదీన  విచారణకు రావాలని  ఆ నోటీసులో  సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో  ఇవాళ తెలంగాణ హైకోర్టులో సునీల్ కనగోలు  పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల  13వ తేదీన రాత్రి  హైద్రాబాద్ మాదాపూర్ లో  కాంగ్రెస్ వార్ రూమ్ పై  పోలీసులు దాడులు నిర్వహించారు.  మహిళలపై  అనుచితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని   ఈ దాడులు నిర్వహించినట్టుగా  పోలీసులు ప్రకటించారు.  ఈ సమయంలో   ఈ కార్యాలయంలో  ఉన్న  సిబ్బందిని  పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడిచిపెట్టారు.ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా  దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

also read:కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలుకు సీసీఎస్ పోలీసుల నోటీస్:తీసుకున్న మల్లు రవి

గత కొంతకాలంగా  సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా, మహిళలపై  అనుచిత పోస్టులు పెడుతున్నారని  అందిన ఫిర్యాదుల మేరకు  ఐపీ అడ్రస్  ఆదారంగా  దాడులు నిర్వహించినట్టుగా  పోలీసులు ప్రకటించారు.   కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త  సునీల్ కనుగోలు  మాదాపూర్ లో  ఈ కార్యాలయం నిర్వహిస్తున్నారు.  

గత కొంతకాలంగా  కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో  సునీల్ కనుగోలు  కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా  పనిచేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన  సోషల్ మీడియాను  కూడా  సునీల్  కనుగోల్ టీమ్ ఆపరేట్  చేస్తుందని సమాచారం.  ఈ క్రమంలోనే  కేసీఆర్ తో పాటు  బీఆర్ఎస్  నేతలపై  సోషల్ మీడియా వేదికగా  ఈ కార్యాలయం నుండి పోస్టులు పెడుతున్నారని సీసీఎస్  పోలీసులు గుర్తించారు. 

ఈ విషయమై  సునీల్ కనుగోలుతోపాటు  ఆయన బృందానికి  సీసీఎస్ పోలీసులు ఇప్పటికే  నోటీసులుజారీ చేశారు.అయితే తనకు 10 రోజుల సమయం కావాలని సునీల్ కనుగోలు  సీసీఎస్ పోలీసులను కోరారు. ఈ నెల  26వ తేదీన సునీల్ కనుగోలు సహా ఆయన టీమ్ విచారణకు రావాల్సి ఉంది. కానీ విచారణకు రాలేదు.  దీంతో ఈ నెల  27న మరోసారి  సీసీఎస్ పోలీసులు  సునీల్ కనుగోలుకు  సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  ఈ నెల  30వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో  ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని  కోరుతూ  సునీల్ కనుగోలు  ఇవాళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios