హైదరాబాద్: మంచి పార్టీని ఎన్నుకోండి, ఓటు వెయ్యండి అని సినీనటి కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా  జూబ్లీహిల్స్ యూరో కిడ్స్ స్కూల్‌లో విజయశాంతి ఓటు మక్కును వినియోగించుకున్నారు.  

అనంతరం మీడియాతో మాట్లాడిన రాములమ్మ ఓటు హక్కు అనేది అందరి బాధ్యత అని, ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మంచి పార్టీని ఎన్నుకోవాలని, భవిష్యత్ బాగుంటుందని తెలంగాణ ప్రజలకు విజయశాంతి సూచించారు.