తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తటస్థంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కోరారు. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుంది అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన వీహెచ్ తటస్థంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో తమ బతుకు తాము బతుకుతామని చెప్పుకొచ్చారు.   

హైదరాబాద్: తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తటస్థంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కోరారు. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుంది అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన వీహెచ్ తటస్థంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో తమ బతుకు తాము బతుకుతామని చెప్పుకొచ్చారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు మాజీమంత్రి జి.వినోద్ కాంగ్రెస్ లో చేరతారంటూ వస్తున్న వార్తలపై వీహెచ్ మండిపడ్డారు. వినోద్ లావంటి వాళ్లను పార్టీలో చేర్చుకుంటే కార్యకర్తల్లో నిరుత్సాహం కలుగుతుందన్నారు. కాకా కుటుంబానికి కాంగ్రెస్‌లో జరిగినంత న్యాయం ఎక్కడా జరగలేదని వీహెచ్ స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోవడం..మళ్లీ తిరిగి రావడం కుదరదని స్పష్టం చేశారు.

సమయం ఇస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అన్నీ చెప్తానని వీహెచ్ తెలిపారు. మరోవైపు తాను చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి స్పందన బాగా వస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే అని వీహెచ్ అన్నారు. ప్రతీ పార్లమెంట్ పరిధిలో బీసీలకు రెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.