హైదరాబాద్: టీఆర్ఎస్ లో చేరిన మాజీ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంటేరుకు చాలా ప్రాధాన్యత ఇచ్చిందని అయినా స్వలాభం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరారంటూ మండిపడ్డారు. 

పార్టీ మారుతున్న నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆయారాం, గయారాంలకు జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వొద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం లేఖ ఇచ్చిన చంద్రబాబుతో తాము కలిస్తే తప్పేంటని నిలదీశారు. 

తెలంగాణను అడ్డుకున్న జగన్‌ దగ్గరకు టీఆర్‌ఎస్‌ నేతలు ఎలా వెళ్తారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల వ్యక్తిని సీఎల్పీ నేతగా నియమించిన రాహుల్‌కు వీహెచ్‌ ధన్యవాదాలు తెలిపారు.