టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంపై రాష్ట్రంలో చాలా మంది కార్యకర్తలు, నేతలు వ్యతిరేకతతో ఉన్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ పార్టీతో ఉత్తమ్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, భట్టిని సైతం ఓడించేందుకు ఉత్తమ్ కుయుక్తులు పన్నారని ఆరోపించారు. . దారినపోయే దానయ్యలకు జనరల్ సెక్రటరీ, సెక్రటరీ పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు.

నిన్నటి సమావేశంలో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వారిని ఉత్తమ్ కుమార్ వారించలేదని తెలిపారు.  పూటకు గడవని వాళ్లను జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలుగా నియమించుకుని ఉత్తమ్ పెత్తనం చెలాయిస్తున్నారని సర్వే ఎద్దేవా చేశారు.

ఆయన నాయకత్వంలో చాలామందికి అన్యాయం, అవమానం జరిగిందన్నారు. తాను కేవలం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌నేనని, ఇంకా చాలామంది బ్యాట్స్‌మెన్లు వస్తారని సత్యనారాయణ జోస్యం చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హఠావ్.. తెలంగాణ కాంగ్రెస్ బచావ్’’ అంటున్నారని కార్యకర్తలు తనకు మద్ధతుగా నిలుస్తున్నారి సర్వే తెలిపారు.

‘‘రా చూసుకుందాం’’..గుండాగిరి, దాదాగిరి నాకు తెలుసు: ఉత్తమ్‌కు సర్వే హెచ్చరిక

ముఖ్యమంత్రిని అవుతాననే.. ఉత్తమ్ నన్ను ఓడించాడు: సర్వే