హైదరాబాద్: ఇంటర్ పరీక్షా ఫలితాల అవకతవకలకు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వైఫల్యంతోనే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. 

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉండి చోద్యం చూస్తున్నారని ఘాటుగా  విమర్శించారు. కేసీఆర్‌ది విధానాల సర్కార్‌ కాదని నినాదాల సర్కార్‌ అంటూ విమర్శించారు. 

విద్యార్థుల మరణాలపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. తెలంగాణలో డ్రగ్‌, పబ్‌, ఇసుకమాఫియా రెచ్చిపోతోందన్నారు. తప్పుచేశాడు కాబట్టే మోదీ వద్ద కేసీఆర్‌ మోకరిల్లారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.