Asianet News TeluguAsianet News Telugu

న్యూఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: అభ్యర్థుల జాబితాపై కసరత్తు

కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది. ఈ నెల  25 లేదా  26వ తేదీన  కాంగ్రెస్ ఎన్నికల కమిటీ రెండో జాబితాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

 Congress Screening Committee Meet Today for Finalize  Candidates list lns
Author
First Published Oct 22, 2023, 3:31 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై  కాంగ్రెస్ స్క్రీనింగ్  కమిటీ  ఆదివారం నాడు సమావేశమైంది. ఈ సమావేశానికి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాలేదు.  నిన్న కూడ  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిన్నటి సమావేశానికి  కొనసాగింపుగా ఇవాళ సమావేశం  జరిగింది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఇవాళ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో  ఈ నెల  25, 26 తేదీల్లో  కాంగ్రెస్  పార్టీ ఎన్నికల కమిటీ  సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కంటే ముందే మరోసారి  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో  అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయనుంది. లెఫ్ట్ పార్టీలకు నాలుగు అసెంబ్లీ సీట్లను కేటాయించాలని  కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది .

 సీపీఐ, సీపీఎంలకు రెండేసీ అసెంబ్లీ స్థానాలను ఇవ్వనుంది.  సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలను కేటాయించనుంది కాంగ్రెస్. మిర్యాలగూడతో పాటు పాలేరు అసెంబ్లీ సీటును సీపీఎం కోరుతుంది. అయితే పాలేరుకు బదులుగా  వైరా అసెంబ్లీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. కానీ వైరా నుండి పోటీకి  సీపీఎం ఆసక్తిగా లేదు. ఈ విషయమై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శితో  మాట్లాడాలని  కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  న్యూఢిల్లీకి వచ్చి పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

also read:కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా: దసరా తర్వాత విడుదల

వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది.  రెండో జాబితా కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ  మరోసారి  భేటీ కానుంది.ఈ భేటీలో  రెండో జాబితాపై  స్పష్టత రానుంది.  స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసే జాబితాకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ  ఆమోదం తెలపనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios