లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటినుండే గెలుపు కోసం వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే పటిష్టంగా కనిపిస్తున్న స్థానాల్లో కూడా ఇతర పార్టీలకు అనుకూలంగా వున్న ప్రతి ఓటర్ ను తమవైపు మళ్లించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఇతర పార్టీల నుండి గెలిచిన సర్పంచ్ లను టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఇలా ఇవాళ నిజామాబాద్ కు చెందిన ఇద్దరు సర్పంచ్ లు టీఆర్ఎస్ గూటికి చేరారు. 

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శనివారం జగిత్యాల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల కాంగ్రెస్ సర్పంచ్ లు టీఆర్ఎస్ లో చేరారు.  స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

బీర్పూర్ మండలం తాళ్ళ ధర్మారం తాళ్ల ధర్మారం సర్పంచ్ నల్ల మహిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ దూస ఎల్లక్కలతో పాటు వార్డు సభ్యులకు కవిత గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే చిత్ర వేణి గూడెం సర్పంచ్ సుగుణ మారుతి, ఉపసర్పంచ్ చిక్రం భీమా, వార్డు సభ్యులు...రంగసాగర్ గ్రామ సర్పంచ్ బొడ సాగర్ స్వప్న, కండ్ల పల్లి గ్రామ సర్పంచ్ పర్వతం రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ రామడుగు శ్రీనివాస్ తో పాటు వార్డు మెంబర్లకు ఎంపీ టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

వీడియో

"